కామారెడ్డి జిల్లాలో 91, 935 ఎకరాలలో సోయాబీన్ పంట వేశారని జిల్లా మార్క్ ఫెడ్ మేనేజర్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మార్క్ ఫెడ్ తరపున రైతులకు మద్దతు ధర క్వింటాల్ కు రూ. 4, 892 అందిస్తూ.. 9 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి జనవరి 1వరకు 8, 071 రైతుల నుండి 1, 37, 871 క్వింటాళ్లు కొనుగోళ్లు చేశామని, జనవరి 7వతేదీ వరకు మాత్రమే సోయాబీన్ కొనుగోలు జరుగుతుందని పేర్కొన్నారు.