
తండ్రితో గొడవ.. నాలుగేళ్ల చిన్నారిని నేలకేసి కొట్టాడు
మహారాష్ట్రలో అమానుష ఘటన చోటుచేసుకుంది. 4 ఏళ్ల చిన్నారిని ఓ వ్యక్తి నేలకేసి కొట్టాడు. ముంబయిలోని ఒక హౌసింగ్ సొసైటీలో కొంత మంది చిన్నారులు ఆడుకుంటున్నారు. అటుగా ఆగ్రహంతో వచ్చిన సందీప్ పవార్ అనే వ్యక్తి ఆడుకుంటున్న విఘ్నేశ్(4) అనే చిన్నారిని విచక్షణా రహితంగా కొట్టాడు. విఘ్నేశ్ తలను బలంగా నేలకేసి బాదాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. బాలుడి తండ్రితో జరిగిన గొడవ కారణంగానే చిన్నారిపై దాడి చేసినట్లు సమాచారం. చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దృశ్యాలు SMలో వైరల్ అవుతున్నాయి.




