కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్, రైల్వే స్టేషన్ సమీపంలో అనాధ వృద్ధులకు పాత్రికేయుడు మహేష్ గౌడ్ కుమారుడు నందన్ గౌడ్ 8వ జన్మదిన సందర్భంగా అన్నదానం నిర్వహించారు. చిన్నారి నందన్ గౌడ్ మాట్లాడుతూ.. నా జన్మదిన సందర్భంగా పూటకు నోచుకోని వృద్ధులకు ఒక్కపూట భోజనం పెట్టడం ద్వారా వారి ఆశీర్వాదం దొరుకుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు.