బీబీపేటలో మినీ బస్టాండ్ ఏర్పాటు చేయాలి.. మాజీ ఎంపీటీసీ

0చూసినవారు
కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో మినీ బస్టాండ్ ఏర్పాటు చేయాలని, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలని మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ భర్త కొరివి నరసింహులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో, బీబీపేట మీదుగా పలు ప్రాంతాలకు బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయని, అలాగే అనేక గ్రామాలకు బస్సు సౌకర్యం ఉందని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, కావున వెంటనే మినీ బస్టాండ్ నిర్మాణం చేపట్టాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్