యువకుడి అరుదైన ఘనత

890చూసినవారు
యువకుడి అరుదైన ఘనత
కామారెడ్డి జిల్లాకు చెందిన యువ పర్వతారోహకుడు విస్లావత్ బన్నీ లడఖ్‌లోని 6,100 మీటర్ల ఎత్తైన మౌంట్ కియాగర్ రీ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించి అరుదైన ఘనత సాధించాడు. రాజంపేట మండలం ఎల్లాపూర్ తండాకు చెందిన బన్నీ, మైనస్ డిగ్రీల తీవ్ర చలి, ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ శిఖరాన్ని చేరుకున్నాడు. అతని ఈ సాహసయాత్ర యువతకు స్ఫూర్తిగా నిలిచింది. ఈ విజయంపై పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు.

సంబంధిత పోస్ట్