కామారెడ్డి జిల్లాలో వివిధ ప్రాంతాలలో వదిలివేయబడ్డ లేదా పట్టుబడిన వాహనాలను చట్టపరమైన ప్రక్రియలో భాగంగా జిల్లా పోలీసు శాఖ ఆద్వర్యంలో వేలం వేయడం జరుగుతుందని ఎస్పీ రాజేష్ చంద్ర శనివారం తెలిపారు. ప్రస్తుతం 217 వాహనాలు కామారెడ్డి స్టేషన్ ఆవరణలో భద్రపరచబడ్డాయని, వాహన యజమానులు తమ వాహనాన్ని గుర్తించి, ఎంవిఐ ఏ. నవీన్ కుమార్ ను సంప్రదించి, ధ్రువపత్రాలను చూపించి వాహనాన్ని తీసుకెళ్ళొచ్చన్నారు.