ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతిని పురస్కరించుకొని బీబీపేట్ మండల పద్మశాలీలు ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. పద్మశాలి సంఘం కామారెడ్డి డివిజన్ అధ్యక్షులు తుమ్మ మచ్చేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మచ్చేందర్ మాట్లాడుతూ బాపూజీ 27 సెప్టెంబర్ 1915న జన్మించి, 21 సెప్టెంబర్ 2012న మరణించారని, ఆయన చివరి క్షణాల వరకు బహుజనుల కోసం పోరాడారని తెలిపారు. స్వాతంత్ర ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం, ప్రత్యేక తెలంగాణ తొలి, మలి ఉద్యమాలలో ఆయన క్రియాశీలకంగా పాల్గొన్నారని గుర్తుచేశారు.