మౌళిక భాషా గణిత సామర్థ్యాల సాధన (ఎఫ్ఎల్ఎన్)తో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీని జత చేయడం వల్ల అద్భుత ఫలితాలు సాధించవచ్చని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా అన్నారు. గురువారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు, గుణాత్మక విద్యా సమన్వయకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ లో ఆమె మాట్లాడుతూ ప్రతి జిల్లాలో ఏఐ ఆధారిత ఎఫ్ఎల్ఎన్ అమలు చేయాలన్నారు. కామారెడ్డిలో కలెక్టర్ పాల్గొన్నారు.