కామారెడ్డిలో ఏఐటీయూసీ 106వ వ్యవస్థపక దినోత్సవం

1చూసినవారు
కామారెడ్డి వాటర్ సెక్షన్ కోర్టు రోడ్డు వద్ద శుక్రవారం ఏఐటీయూసీ 106వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఏఐటీయూసీ రాష్ట్ర సీనియర్ నాయకులు, ప్రముఖ న్యాయవాది వి.ఎల్. నరసింహారెడ్డి ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏఐటీయూసీ 105 ఏళ్ల నుండి 106 సంవత్సరాల్లోకి అడుగుపెట్టిందని, దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో 1920 అక్టోబర్ 31న ఆవిర్భవించిందని తెలిపారు. దేశ స్వాతంత్ర్యంలో నాటి బ్రిటీష్ ప్రభుత్వంలో కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం నిర్వహించిన చరిత్ర ఏఐటీయూసీదని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :