రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రాణ స్నేహితులైన కోట అనిల్ యాదవ్ (24), బంగ్ల అన్వేష్ గౌడ్ (24) కారు ప్రమాదంలో మృతి చెందారు. శుక్రవారం కామారెడ్డి వెళ్లొస్తుండగా, మాచారెడ్డి మండలం కాకుల గుట్ట తండా వద్ద అతివేగంతో కారు మర్రి చెట్టును ఢీకొనడంతో అనిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. హైదరాబాద్ తరలించిన అన్వేష్ గౌడ్ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. వీరిద్దరూ కుటుంబాల్లో ఏకైక కుమారులు కావడంతో కుటుంబాలు, ఊరు తీవ్ర విషాదంలో మునిగింది. వికాస్ పరిస్థితి విషమంగా ఉంది.