కామారెడ్డి జిల్లాకు చెందిన పొట్టిగిని శంకర్ తెలంగాణ
కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ నియామక పత్రాలను తెలంగాణ ప్రదేశ్
కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్, మానకొండూరు శాసనసభ్యులు (MLA) మరియు తెలంగాణ
కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గార్ల చేతుల మీదుగా ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ కు అభినందనలు వెల్లువెత్తాయి.