దోమకొండలో హెచ్ఐవి ఎయిడ్స్ పై కళాజాత

12చూసినవారు
దోమకొండలో హెచ్ఐవి ఎయిడ్స్ పై కళాజాత
దోమకొండ మండల కేంద్రంలోని వారపు సంతలో సోమవారం సాయంత్రం జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో హెచ్ఐవి, ఎయిడ్స్ పై కళాజాత నిర్వహించారు. హెచ్ఐవి వ్యాపించే మార్గాలు, హెచ్ఐవి బాధితుల పట్ల వివక్షత రూపుమాపటం, హెచ్ఐవి నివారణ జాగ్రత్తల గురించి కళా జాతలో నందిని బృందం అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఐరేని నర్సయ్య, ఉప సర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, వార్డు సభ్యులు పాలకుర్తి శేఖర్, శివరాం మందిర్, ఆలయ కమిటీ చైర్మన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్