నాగిరెడ్డిపేట మండలంలోని జలార్పూర్, కన్నారెడ్డి గ్రామాల్లో పేకాట ఆడుతున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు స్థానిక ఎస్సై భార్గవ్ సిబ్బందితో శుక్రవారం రాత్రి దాడి నిర్వహించారు. రెండు స్థావరాల్లో 8 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.17,540 స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై హెచ్చరిస్తూ, పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.