కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి లక్ష్మీ నగర్ తండాలో అత్తా కోడళ్ల మధ్య జరిగిన గొడవతో మనస్తాపానికి గురైన శోభ(57) అనే అత్త ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను ఆసుపత్రికి తరలించగా, మార్గమధ్యంలో మృతి చెందింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.