కామారెడ్డి జిల్లా దోమకొండలో హెచ్ఐవి, ఎయిడ్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మంగళవారం బాలికల, బాలుర, పలుగడ్డ ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, జిల్లా వైద్యశాఖ, వై ఆర్ జీ కేర్ లింకు వర్కర్ స్కీం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. హెచ్ఐవి నివారణకు అవగాహనే ప్రధానమని మండల విద్యాశాఖ అధికారి విజయ్ కుమార్ తెలిపారు. కామారెడ్డి ఐ సి టి సి కౌన్సిలర్ మేక నాగరాజు హెచ్ఐవి వ్యాపించే మార్గాలు, లక్షణాలు, బాధితులకు అందిస్తున్న వైద్య సేవలు, వారి పట్ల వివక్ష చూపరాదని వివరించారు.