కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండలం యాడవరం గ్రామంలో శివరామ్ రెడ్డి పల్లి వెళ్లే చౌరస్తాలో మాజీ వార్డు సభ్యురాలు పిడుగు సుజాత, మహిళలు బతుకమ్మ పండుగను శనివారం ఉత్సాహంగా జరుపుకున్నారు. 'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో' అంటూ పాటలు పాడుతూ, పూలతో అలంకరించిన బతుకమ్మ చుట్టూ తిరుగుతూ మహిళలు సంబరాల్లో మునిగిపోయారు. ఈ పండుగ మహిళల ఆనందాన్ని, సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పింది.