బీబీపేట మండలంలోని మాందాపూర్ గ్రామంలో శుక్రవారం ఎంపీడీవో పూర్ణ చంద్రోదయ కుమార్ ఇంటింటికి మొక్కల పంపిణీ చేశారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పందిరి మధుసూదన్ రెడ్డి, గ్రామ ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ శ్రీనివాస్ గౌడ్, అంగన్వాడీ టీచర్స్, గామ మహిళలు, తదితరులు పాల్గొన్నారు.