ముదిరాజ్ యువత ఉద్యమిస్తేనే బీసీ "A" సాధ్యం: డాక్టర్ భట్టు విఠల్

3చూసినవారు
గాంధారి మండల కేంద్రంలో జరిగిన TMMS యువజన విభాగం ప్రమాణ స్వీకార సమావేశంలో ముదిరాజ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బట్టు విఠల్ ముదిరాజ్ మాట్లాడుతూ, ముదిరాజ్ యువత ఉద్యమిస్తేనే బీసీ "A" వర్గం సాధ్యమవుతుందని, ఉద్యోగ, విద్యా, ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అన్నారు. ఓటు హక్కుతోనే జాతికి రాజ్యాధికారం సాధ్యమని, యువత సంఘటితం కాకపోతే జాతి తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటుందని ఆయన హెచ్చరించారు. మైనార్టీ వర్గాలు తమ హక్కులను సాధించుకుంటున్నాయని, ముదిరాజ్ యువత గ్రహించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్