కల్కినగర్ లో దుర్గమాత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి మండపం కొరకు భూమిపూజ జరిగింది. ఈ సందర్భంగా శ్రీ దుర్గామాత సేవా కమిటీ అధ్యక్షులు అంబీర్ రాజేందర్ రావు మాట్లాడుతూ, నవరాత్రి ఉత్సవాలు, కుంకుమ పూజలు, అన్నదానం కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ జనరల్ సెక్రటరీ, కోశాధికారి, పలువురు సభ్యులు, పురోహితులు పాల్గొన్నారు.