కామారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో, గౌరవ శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గారి ఆదేశాల మేరకు, కామారెడ్డి పట్టణ బీజేపీ దళిత మోర్చా (SC) నూతన కార్యవర్గాన్ని పట్టణ అధ్యక్షుడు సంగీ రాజేందర్ ప్రకటించారు. ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, మరియు కార్యవర్గ సభ్యులను నియమించారు. నూతన కార్యవర్గాన్ని పట్టణ బీజేపీ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ శాలువాలతో సన్మానించారు. అందరూ కలిసి పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేస్తూ పార్టీని పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు.