రాజంపేట మండల నూతన ఎంపీడీఓని సన్మానించిన బీజేపీ నాయకులు

64చూసినవారు
రాజంపేట మండల నూతన ఎంపీడీఓని సన్మానించిన బీజేపీ నాయకులు
కామారెడ్డి జిల్లా రాజంపేట మండల నూతన మండల అభివృద్ధి అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఏ బాలకృష్ణని రాజంపేట మండల బీజేపీ నాయకులు శుక్రవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ అందరి సహకారంతో మండలంలో తన వంతు అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దగ్గరి నరేష్, ఓబీసీ అధ్యక్షులు బల్ల కిషోర్, టౌన్ కార్యదర్శి ప్రసాద్, బూత్ అధ్యక్షులు వంశీ మహేష్, పంతులు నవీన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్