రక్తదానం ప్రాణాలను కాపాడే పుణ్యకార్యం: హైకోర్టు న్యాయమూర్తి

730చూసినవారు
రక్తదానం ప్రాణాలను కాపాడే పుణ్యకార్యం: హైకోర్టు న్యాయమూర్తి
కామారెడ్డి జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ నర్సింగరావు నందికొండ మాట్లాడుతూ, రక్తదానం ప్రాణాలను కాపాడే పుణ్యకార్యమని అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సంయుక్తంగా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. థాలసీమియా బాధిత చిన్నారులకు ఈ రక్తదానం ఎంతో మేలు చేస్తుందని ఆయన తెలిపారు. అనంతరం, జిల్లా న్యాయమూర్తులతో జుడీషియల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్