
ఢాకా జాతీయ జూకు ట్రంప్ గేదె
బంగ్లాదేశ్‌లో బంగారు రంగు జుట్టుతో, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను పోలి ఉన్న అరుదైన అల్బినో గేదెకు ప్రభుత్వం ప్రాణదానం చేసింది. ఈద్ బలి కోసం విక్రయించిన ఈ గేదె, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజల్లో ఆసక్తి పెరిగింది. భద్రతాపరమైన ఆందోళనలు, ప్రజాదరణ దృష్ట్యా హోం మంత్రి సలాహుద్దీన్ అహ్మద్ జోక్యంతో గేదెను బలి నుంచి తప్పించి, ఢాకా జాతీయ జూకు తరలించారు. నాలుగేళ్ల ఈ గేదెకు ప్రత్యేక సంరక్షణ అవసరమని, ఇది జన్యుపరమైన అల్బినిజం వల్ల తెల్లగా ఉందని అధికారులు తెలిపారు.




