చీఫ్ మినిస్టర్ కప్ 2025: క్రీడలతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
కామారెడ్డి జిల్లా, కామారెడ్డిలో చీఫ్ మినిస్టర్ కప్ 2025 మండల్ లెవల్ టోర్నమెంట్ ను బిబిపేట్ mjptbcwrs గ్రౌండ్లో స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ గారి అధ్యక్షతన, సర్పంచ్ సాద్విక గారి సమక్షంలో వాలీబాల్, కబడ్డీ, కోకో టోర్నమెంట్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. నాయకులు మాట్లాడుతూ, పిల్లలు ఫోన్లకు దూరంగా ఉండి క్రీడలపై దృష్టి సారించి, రాష్ట్రస్థాయిలో రాణించి గ్రామం, మండలం గర్వపడేలా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, మాజీ డీసీయంస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుతారి రమేష్ పాల్గొన్నారు.
