కామారెడ్డి: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే అవకతవకలపై సీఐడీ విచారణ చేయించాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కోరారు. ఈ మేరకు బుధవారం సీఎం రేవంత్ కి ఆయన లేఖ రాశారు. సమగ్ర కుటుంబ సర్వే లేదా ఐహెచ్ఎస్ 2014 పేరుతో ఎస్సీ, ఎస్టీలు, బీసీలతో సహా వివిధ కుటుంబాల తప్పుడు సమాచారంతో ఓ పత్రం ప్రచారంలో ఉందని సీఎంకు రాసిన లేఖలో ప్రస్తావించారు. ఈ సర్వే గణాంకాలను నాటి ప్రభుత్వం ఏనాడు విడుదల చేయలేదన్నారు.