కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తాగి 99మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయిన్నట్లు సమాచారం. శనివారం ఎక్సైజ్ ఉన్నతధికారులతో సమీక్ష నిర్వహించి, కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దామరంచ, అంకోల్, దుర్కి, సంగెం మండలాల్లో 69మంది, గౌరారంలో 30 మంది కల్తీ కల్లుతాగి అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో నల్గురిని అరెస్టు చేశారు. 27 మందిపై కేసులు చేసారు.