100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా కామారెడ్డి పురపాలక సంఘ 13వ వార్డు పరిదిలోని టేక్రియాల్ లో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్క్ ను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రారంభించారు. ఈ పార్కు ఈ ప్రాంతంలోని పిల్లలందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, పార్కును శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మునిసిపల్ అధికారులను ఆదేశించారు.