పారిశుద్ధ్య పనుల తీరు పరిశీలించిన కలెక్టర్

4చూసినవారు
పారిశుద్ధ్య పనుల తీరు పరిశీలించిన కలెక్టర్
గురువారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వన్ ఎల్లారెడ్డి సెగ్మెంట్ రాజంపేట మండల కేంద్రంలో పారిశుద్ధ్య పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. మురుగు నీటి పారుదల, చెత్త సేకరణ, రోడ్ల శుభ్రత వంటి అంశాలను పరిశీలించి, ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా నీటి నిల్వలు లేకుండా చూడాలని, చెత్తను సమయానికి తరలించాలని, శానిటేషన్ వర్కర్లు పర్యవేక్షణలో ఉండేలా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :