విద్యా శాఖ ముఖ్యమంత్రి వద్దే ఉన్నప్పటికీ, రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ ఘటనలు వరుసగా జరుగుతుండటం సిగ్గుచేటని జాగృతి చీఫ్ కవిత అన్నారు. గద్వాలలోని ST సంక్షేమ హాస్టల్లో కలుషిత ఆహారం తిని 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ఆమె X వేదికగా స్పందించారు. వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని విమర్శించారు. ఈ ఘటన ప్రభుత్వ చేతగానితనాన్ని, పేదింటి బిడ్డలంటే లెక్కలేనితనాన్ని బయటపెట్టిందన్నారు.