
హిందూజా గ్రూప్ ఛైర్మన్ కన్నుమూత
ప్రముఖ వ్యాపార సంస్థ హిందూజా గ్రూప్ ఛైర్మన్ గోపీచంద్ పి. హిందూజ (85) లండన్లో మంగళవారం తుదిశ్వాస విడిచారు. గత కొన్ని వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన లండన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 2023లో సోదరుడు శ్రీచంద్ మరణానంతరం గ్రూప్ సంస్థలకు ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన గోపీచంద్, వ్యాపార వర్గాల్లో ‘జీపీ’గా సుపరిచితులు. ఆయనకు భార్య సునీత, కుమారులు సంజయ్, ధీరజ్, కుమార్తె రీతా ఉన్నారు.




