
డీప్ ఫేక్, సైబర్ నేరాలకు ఎవరూ భయపడొద్దు: చిరంజీవి
తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో జరిగిన ఏక్తా దివస్ కార్యక్రమంలో నటుడు చిరంజీవి పాల్గొన్నారు. దేశాన్ని ఏకం చేసిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. డీప్‌ఫేక్, సైబర్ నేరాలపై ఆయన స్పందిస్తూ, ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లానని, డీజీపీ, సీపీ సజ్జనార్ దీన్ని సీరియస్‌గా తీసుకున్నారని తెలిపారు. వీటిపై చట్టం తెచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని, సామాన్యులకు కూడా రక్షణ కల్పిస్తారని చిరంజీవి అన్నారు.




