కామారెడ్డిలో చెత్త కుప్పపై కౌన్సిలర్ వినూత్న నిరసన

0చూసినవారు
కామారెడ్డి పట్టణంలో పారిశుద్ధ్య సమస్య తీవ్రతరం కావడంతో స్థానికంగా నిరసనలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా 44, 45 వార్డుల పరిధిలోని సుభాష్ రోడ్డులో పేరుకుపోయిన చెత్తతో ఆ ప్రాంతం డంపింగ్ యార్డులా మారిందని, 46వ వార్డు కౌన్సిలర్ గెరిగంటి లక్ష్మీనారాయణ బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఆయన నేరుగా చెత్త కుప్పలోనే కూర్చొని నిరసన తెలిపారు. పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్