కామారెడ్డి సెగ్మెంట్ దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సన్నపల్లి బస్టాండ్లో గుర్తు తెలియని వృద్దుని శవం గుర్తించినట్లు ఎస్ఐ రాజు తెలిపారు. గురువారం ఎస్ఐ మాట్లాడుతూ.. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగిందని, ఎవరైనా గుర్తుపడితే కామారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ మొబైల్ 8712686148 నంబర్ కు కాల్ చేయాలని కోరారు.