శిథిలావస్థలో ఉన్న పాఠశాల అదనపు గదుల కూల్చివేత

2చూసినవారు
శిథిలావస్థలో ఉన్న పాఠశాల అదనపు గదుల కూల్చివేత
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం పలుగడ్డ ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం శిథిలావస్థలో ఉన్న రెండు గదులను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కూల్చివేశారు. ఈ పనులను మాజీ జడ్పి టీసి తిరుమల గౌడ్ పరిశీలించి, డీఈఓ రాజుతో మాట్లాడి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానోపాధ్యాయులు జస్వంత్ రావు చొరవతో ఈ అదనపు గదులను కూల్చివేయడం విద్యార్థులకు మేలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయు మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి బోడ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :