కామారెడ్డి జిల్లా దోమకొండలోని శివరాంమందిరం, మార్కండేయ శివాలయంలో ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజున ఆలయ కమిటీ ప్రతినిధులు వందలాది దీపాలను వెలిగించి ఆలయాన్ని అలంకరించడం ఆనవాయితీ. బుధవారం సాయంత్రం భక్తులు, మహిళలు, పిల్లలు, పెద్దలు కలిసి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఈ దీపాల అలంకరణ భక్తులను, యువతను విశేషంగా ఆకట్టుకుంది. కార్తీక దీపాలను చూడటానికి వందలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు.