తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం బుధవారం బాన్సువాడ పట్టణంలో జరిగింది. 13వ వార్డులోని వడ్రంగి సంఘం వద్ద ఉన్న రేషన్ షాప్ నెంబర్ (1) పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మార్వో రాజా నరేందర్ గౌడ్ తో కలిసి స్థానిక వార్డు కౌన్సిలర్ ఖాలేఖ్, మైనారిటీ సెక్రెటరీ ఎండీ దావూద్, కో-ఆప్షన్ సభ్యురాలు ఖమర్ సుల్తానా గౌస్ లబ్ధిదారులకు కార్డులను అందించారు. ఈ కార్యక్రమంలో జీపీవోలు హర్ష, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.