
మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిన వల్లభనేని వంశీ
గన్నవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై హత్యాయత్నం కేసు నమోదైన నేపథ్యంలో ఆయన మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు. తనపై దాడికి వంశీ అనుచరులే పాల్పడ్డారని సునీల్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వంశీతో పాటు మరో 8 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ప్రత్యేక పోలీస్ బృందాలు గన్నవరం, హైదరాబాద్‌లలో వంశీతో పాటు మిగతా నిందితుల కోసం గాలిస్తున్నాయి.




