కామారెడ్డి జిల్లా బీబీపేట్ గ్రామంలోని 77వ బూత్ లో SIR (సమగ్ర ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్) గురించి ప్రతి ఇంటికి వెళ్లి దరఖాస్తు ఫారాలు పంపిణీ చేశారు. SIR గురించి ప్రజలకు పూర్తి వివరాలు తెలియజేస్తూ, ఓటర్ల జాబితా క్రమబద్ధీకరణ (సవరణ) కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని తమ పేరు నమోదు చేసుకోవాలని మాజీ మండల కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ ఆసిఫ్ కోరారు. ఈ కార్యక్రమంలో BLO వడ్నాల రవి, అంగన్వాడి టీచర్ శ్వేత, మరియు ప్రజలు పాల్గొన్నారు.