దోమకొండ మండలంలోని గొట్టిముక్కుల గ్రామానికి చెందిన మడ్తల సత్యనారాయణ ఈనెల 4న హైదరాబాద్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి వెళ్లి గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొంది బుధవారం గ్రామానికి చేరుకున్నారు. మాజీ జెడ్పిటిసి తీగల తిర్మల్ గౌడ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయనను పరామర్శించారు. ఆయన వెంట దోమకొండ పట్టణ అధ్యక్షులు సీతారాం మధు, గొట్టిముక్కుల గ్రామ అధ్యక్షులు సంతోష్ రెడ్డి, అబ్రబోయిన రాజేందర్, పూలబోయిన రమేష్ తదితరులున్నారు.