కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పొదుపు సంఘాల మహిళలను కొందరు సీసీలు, సీఏలు, వీఎల్‌ఈలు మోసం చేసి కోటి రూపాయలకు పైగా రుణ వాయిదాలను గుటుక్కుమన్నారని వార్తలు వస్తున్నాయి. మహిళల అమాయకత్వం, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని ఈ ఘటనలకు పాల్పడినట్లు తెలుస్తోంది. కామారెడ్డి మండలం నర్సన్నపల్లిలోనూ మహిళా సంఘాల నుంచి రూ.11 లక్షల వరకు దోపిడీ జరిగింది. మోసపోయినట్లు ఆలస్యంగా తెలుసుకున్న మహిళా సంఘాలు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ వ్యవహారంలో కొందరిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. బాధ్యుల నుంచి నగదు రికవరీ చేయాల్సి ఉంది.