ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ పై అవగాహన కలిగి ఉండాలని ఐఈసీ డిప్యూటీ డైరెక్టర్ రవికుమార్ అన్నారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్లకు కామారెడ్డి కళాభారతి ఆడిటోరియంలో ఒక్కరోజు శిక్షణ జరిగింది. హెచ్ఐవి ఎయిడ్స్ నివారణలో అంగన్వాడి వర్కర్ల పాత్ర కీలకమని అలాగే ప్రతి గర్భిణీ స్త్రీకి హెచ్ఐవి/సిఫిలిస్ పరీక్షలు జరిగేటట్టు చూడాలని రవికుమార్ అన్నారు.