బాన్సువాడలో సహకార సంఘాల వారోత్సవాల్లో భాగంగా శనివారం SRNK కళాశాలలో వ్యాస రచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బి విఠల్ ముదిరాజ్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఐ గంగాధర్ మాట్లాడుతూ, సహకార సంఘాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, రైతుల ఆర్థిక, సామాజిక అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. 'రైతుల అభివృద్ధి దేశాభివృద్ధి' అని, సహకార సంఘాలతో ప్రభుత్వం సమన్వయం చేసుకుంటుందని పేర్కొన్నారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.