తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 8వేల కోట్ల విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ స్కాలర్ షిప్ లను వెంటనే విడుదల చేయాలని కోరుతూ, శనివారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో బిక్షాటనతో నిరసన తెలిపారు. ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేస్తోందని, ఫీజు రియంబర్స్ మెంట్ లేక ఎందరో విద్యార్థులు నష్టపోతున్నారని ఎస్ఎఫ్ఐ నేతలు ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల చేయకుంటే తీవ్ర ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.