కామారెడ్డి జిల్లాలో గురువారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కళాశాలల బంద్ విజయవంతంగా జరిగింది. పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయాలని, ఫీజుల బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసే జీఓ 9ను తక్షణమే రద్దు చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సంఘం జిల్లా అధ్యక్షులు సాప శివరాములు, గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షులు నీల నాగరాజు హెచ్చరించారు. ప్రైవేట్ కళాశాలలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి.