కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణంలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. దేవునిపల్లి ఎస్సై రంజిత్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. అధికారులు ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.