కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమార్పేట్ గ్రామంలో మరణించిన మాజీ ఎంపీటీసీ మరెపు లక్ష్మి నారాయణ కుటుంబాన్ని కామారెడ్డి మాజీ ప్రభుత్వ విప్, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బుధవారం పరామర్శించారు. బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డి, మాజీ రైతుబంధు కన్వీనర్ భూక్యా నర్సింలు, గజ్యా నాయక్ తండా మాజీ సర్పంచ్ హంజి నాయక్ కూడా పాల్గొన్నారు.