గంప గోవర్ధన్ టికెట్ రాక మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నారు

901చూసినవారు
గంప గోవర్ధన్ టికెట్ రాక మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నారు
కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాక మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నారని డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు ఆరోపించారు. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో డిసిసి అధ్యక్షులు మీడియతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వమని మాట్లాడి తన పరువు తన పార్టీ పరువు తీసుకుంటున్నారన్నారు.
10ఏళ్ళ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, పేదలకు నియోజకవర్గానికి 10 ఇండ్లు కూడా ఇవ్వలేదన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు.

ట్యాగ్స్ :