కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నిర్వహించిన సర్వజని గణేష్ నిమజ్జన కార్యక్రమంలో గౌరవ జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొని, భజన బృందంతో కలిసి జెండాను ఆవిష్కరించారు. సర్వజని గణేష్ మందిరం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో భక్తజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బిచ్కుంద మున్సిపల్ చైర్పర్సన్ సీమా సెట్కార్, వైస్ చైర్పర్సన్ పడగల భాగ్యలక్ష్మి,
కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.