బీబీపేటలో భక్తిశ్రద్ధలతో వినాయకుల నిమజ్జనం

11చూసినవారు
బీబీపేటలో భక్తిశ్రద్ధలతో వినాయకుల నిమజ్జనం
కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో నవరాత్రులు పూర్తి చేసుకున్న వినాయక విగ్రహాలను భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న గణనాథులకు వీడ్కోలు పలికేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నిమజ్జనానికి ముందు మండపాల వద్ద ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం విగ్రహాలను వాహనాలపై ఊరేగింపుగా తరలించి నిమజ్జనం చేశారు.

సంబంధిత పోస్ట్