జూలై 9న దేశవ్యాప్తంగా జరిగే జాతీయ సమ్మెకు మద్దతుగా తెలంగాణ రాష్ట్రములోని బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ పిలుపు నిచ్చింది. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో బిఎల్టీయూ జిల్లా కార్యాలయంలో బహుజన జన వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ రాష్ట్ర నాయకులు మాట్లాడుతు.. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేకంగా చట్టాలకు నిరసనగా జూలై 9న దేశ వ్యాప్తంగా సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. సమ్మెకు మద్దతు ఇవ్వాలని వారు కోరారు.